AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు.
నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు.
TGలో పడే వర్షాల వల్ల APకి కొంత వరద వచ్చే అవకాశం ఉందని, దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.