December 23, 2024
GYXxYn5aMAElRko

అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఇద్దరు రైతులు ఆత్మహత్య

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కిష్టగూడేనికి చెందిన మేకల మల్లేశం(45) అనే రైతు 8 ఎకరాల్లో పత్తి, ఎకరంలో వరిని సాగు చేస్తున్నాడు.

వ్యవసాయం కలిసి రాక అప్పులు కావడంతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట్ గ్రామానికి చెందిన రైతు నందిగామ నర్సింహ(55) రెండు ఎకరాల్లో వరి పంట వేశాడు.

అప్పులు అధికం కావడంతో, మనస్తాపంతో ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *