ప్రియురాలిని నమ్మించి తన బావతో కలిసి రేప్ చేసి చంపేసిన ప్రియుడు.. వీళ్లకి సహకరించిన ప్రియుడి తల్లి
హత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరింపు.. పోలీసుల విచారణలో తేలిన నిజాలు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డతండాకు చెందిన రూపావత్ నాగు నాయక్(22) అదే మండలంలోని ఓ తండాకు చెందిన యువతి (19)తో రెండేళ్ల నుండి ప్రేమిస్తున్నాడని నమ్మించాడు.
అతడిని నమ్మిన యువతి రెండేళ్ల క్రితం గర్భం దాల్చగా.. పెళ్లికి నాగు కుటుంబీకులు నిరాకరించడంతో ఆమె వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఏడాదిన్నర క్రితం నాగుపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత తరుచూ నాగు ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరోసారి గర్భవతిని చేశాడు.. రెండు సార్లు ఆ అమ్మాయికి బలవంతంగా గర్భస్రావం చేయించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
దీంతో ఆ యువతి, తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల 14న పట్టలగడ్డతండాలోని ప్రియుడి ఇంటికి వెళ్లింది.. తన కొడుకుపై కేసు పెట్టిందని కక్షతో ఎలా అయిన ఆ అమ్మాయిని చంపాలని నాగు తల్లి పథకం పన్నింది.
పెళ్లి గురించి మాట్లాడాలని ఊరి బయటకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని నాగు మరియు అతని బావ అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశారు.
ఆ తర్వాత ఒక చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇదంతా ఎవరు చూడకుండా నాగు తల్లి రోడ్డు మీద నిల్చుని కాపలా కాసింది.. అమ్మాయి మృతిపై పోలీసులు విచారణ చేపట్టి ప్రియుడు నాగుని, అతని బావని, నాగు తల్లిని అరెస్ట్ చేశారు.