ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెజవాడలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది…
భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, వన్ టౌన్, గవర్నర్ పేట, లబ్బీపేట, మొగల్రాజపురం, పటమట, కష్ణలంక, కానూరు తదితర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వాన పడుతోంది..
దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
మళ్లీ వరద పెరుగుతుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఏకధాటిగా వర్షం కురుస్తోంది.
.
రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. గత కొద్ది రోజులుగా కోస్తాంధ్ర సహా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
తాజాగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగ, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొంది.
దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు.. ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.