దాదాపు రెండు నెలల తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులుగా (కేబినెట్ ర్యాంక్) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పక్క పార్టీల నుండి వచ్చిన రెడ్డి నేతలకే పదవులు అంటూ కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని వారిని బాధ్యతలు స్వీకరించకుండా అధిష్టానం ఆపింది. అయితే ఇప్పుడు ఎవరినీ లెక్క చేయకుండా, గుట్టు చప్పుడు కాకుండా గుత్తా అమిత్ రెడ్డి తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించాడు.