జగిత్యాల – మల్లాపూర్ మండలకేంద్రంలో జగిత్యాల నుంచి నిర్మల్‌కు వస్తున్న బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అయితే బస్సులో ఎక్కిన ఓ ప్రయాణికురాలు కండక్టర్ సీటులో కూర్చుంది. వద్దని చెప్పిన వినిపించుకోలేదు.. పైగా మొబైల్లో పెద్ద సౌండుతో పాటలు పెట్టింది. తన విధులకు ఆటంకం కలుగుతుందని, సౌండ్ తక్కువగా పెట్టుకోవాలని కండక్టర్ సూచించగా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట మాట పెరిగి వారి గొడవ దుర్భాషలాడుకునే స్థాయికి చేరుకుంది. దీంతో డ్రైవర్ బస్సును అక్కడే నిలిపివేశాడు.. డయల్ 100కు కాల్ చేయడంతో సుమారు గంటపాటు బస్సు అక్కడే ఆగిపోయింది. బస్సు కండక్టర్ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు ప్రయాణికురాలు శ్రీదేవిపై కేసు నమోదు చేసిన పోలీసులు