ఈరోజు దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉన్నత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ… పవర్ ప్లాంట్ లో చోరీ జరగడం ఇది రెండవ సారి, భద్రత కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు. దీనికి కారణం అయిన ప్రతిఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలాగే మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు బలంగా ఉండాలి అని అధికారులకు సూచించారు. ఇది ప్రభుత్వం ఖజానా అంటే ప్రజలది ప్రజల ధనాన్ని దొచ్చుకోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులది. గత పాలనలో జరిగిన పొరపాట్లను జరగకుండా. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు. మరో సారి ఇలాంటి ఘటనలు జరిగితే ప్రతి ఒక్కరిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పవర్ ప్లాంట్ SC, ఇతర ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.