మత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ అనే ముస్లీం యువకుడు.. 19 ఏళ్లుగా రాంనగర్‌లో ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు. వృత్తి రీత్యా ఫారిన్‌లో ఉంటానని, ప్రతి ఏడాది మూడు నెలల ముందే వచ్చి.. ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేసుకుంటానని సిద్ధిఖీ చెబుతున్నాడు. చిన్నతనంలో గణేషుడి వల్ల మంచి జరగడంతో.. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నామని అంటున్నారు