December 23, 2024
GW3yqpfW4AA1vgN

వరదనీటిలో పడి మరణించిన వృద్దురాలి మృతదేహాన్ని బయటికి తీసిన దుగ్గొండి ఎస్.ఐ వెంకటేశ్వర్లు, హోమ్ గార్డ్. వివరాల్లోకి వెళితే బిక్షాటన చేసుకొని జీవించే మందపెల్లి గ్రామానికి చెందిన సమ్మక్క (75), ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలోని రైస్ మిల్లు వద్ద వున్న కల్వర్టు మీదుగా నడుస్తూ జారీ కల్వర్టు నీటిలో పడి మృతి చెందింది. మరుసటి రోజు గిర్నిబావి గ్రామ పరిసర పంట పొలాల్లో వృద్ధురాలి మృతదేహాన్ని  స్థానికులు గుర్తించారు. మృత దేహం లభ్యం కావడంతో దుగ్గొండి ఎస్.ఐ వెంకటేశ్వర్లు తన హోం గార్డు రవీందర్ తో సంఘటన స్థలానికి చేరుకొన్నాడు. కాని పంటపొలాల్లో పడివున్న వృద్దురాలి మృతదేహాన్ని రోడ్డు పైకి ఎవరు కూడా తీసుక రాకపోగా చోద్యం చూస్తున్నారు. కాని భాధ్యతెరిగిన దుగ్గొండి ఎస్.ఐ  తన హోదాను సైతం పక్కన పెట్టి తానే స్వయంగా తనతో వచ్చిన హోంగార్డ్ తో కల్సి పంట పొలాల్లో పడివున్న వృద్ధురాలి మృతదేహాన్ని రోడ్డుపై తీసుకవచ్చి పంచనామా నిర్వహించారు. వృద్దురాలి మృతదేహాన్ని బయటకి తీసుకరావడానికి రక్త సంబంధీకులు, బంధువులు సైతం ముందుకు రాకపోవడంతో ఖాకీ చొక్కా చాటున కరుకు గుండె కాదు… కారుణ్యం దాగి ఉంటుందని నిరూపించారు… దుగ్గొండి ఎస్.ఐ  వెంకటేశ్వర్లు, హోంగార్డు రవీందర్… ఈ ఇరువురు పోలీస్ అధికారులు స్పందించిన తీరు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు జయహో పోలీస్… అంటున్నారు ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *