December 23, 2024
download

వినాయక చవితి నవరాత్రోత్సవాల మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ, తెలంగాణలో ఇద్దరి చొప్పున నలుగురి ప్రాణాలు పోయాయి.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలకు విద్యుదాఘాతం కారణమయింది. తెలంగాణలోని హూజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ వినాయకుడి మండపంలో బల్బ్ పెడుతుండగా అది పగిలి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. యశ్వంత్ ఆ కుటుంబానికి ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. కుత్బుల్లాపూర్‌లోనూ మండపంలో విద్యుత్ షాక్ తగిలి నవీన్ అనే యువకుడు మృతి చెందాడు. వేములవాడలోని కొనాయ్యపల్లిలో ఇద్దరు గాయాలు అయ్యాయి. వినాయకుడి మండపం డెకరేషన్ చేస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు చిత్తరంజన్ దాస్, అమిత్ గౌర్ విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డారు. వారిని వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇక ఏపీ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా, అన్నమయ్య జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. రాయచోటిలో మండపాన్ని డెకరేషన్ చేస్తున్న మహేశ్ అనే బాలుడికి కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఈర్ల లక్ష్మయ్యనే వ్యక్తి మండపంలో షాక్ తగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వేర్వేరు ఘటనలపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *