December 23, 2024
musharaf-farooqi

మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయండి – సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖి ఐఏఎస్

సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించుటకు ప్రత్యేక ఏర్పాట్లు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 – 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖి, ఐ.ఏ.ఎస్ తమ విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.

సంస్థ తమ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి గాను, పలు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది. కొంత మంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థ కు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ నేపధ్యం లో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ తెలిపారు.

ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, క్యాటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.

సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణ కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి వున్నది. వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *