నల్గొండ జిల్లాలోని వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదిదేవుడైన వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.