వినాయక చవితి పర్వదినం పురష్కరించుకుని ఖార్ఖన లో ప్రసిద్ధి చెందిన గణేష్ టెంపుల్, న్యూ బోయినపల్లి లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని విద్యా గణపతి ఆలయంలో, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు తీర్ధప్రసాదం ఆశీర్వచనం అందజేశారు. అనంతరం జంపన ప్రతాప్ మాట్లాడుతూ… భక్తి శ్రద్దలతో గణేషు డిని కొలిస్తే అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడని మనం చేపట్టే ప్రతి పనిలో ఆటంకాలు కలుగకుండా కాపాడు తాడని అన్నారు. గణేష్ నవరాత్రులను పురష్కరించు కుని భక్తి శ్రద్దలతో పూజించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని మండప నిర్వాకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మురళి, రాము గౌడ్, టీంకు గౌడ్., దయానంద్ యాదవ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.