సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో వినాయక చతుర్థిని పురస్కరించుకొని ఆ గణనాథుని పూజా కార్యక్రమాన్ని మడుపతి మహేష్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు. పులిమామిడి రాజు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక శుభాకాంక్షలు తెలియ జేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఆ గణనాథుడు ప్రజలందరిని చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని , పిల్లలందరికి మంచి విద్యాబుద్దులు ప్రసాదించాలని , ప్రజలకు ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరున్ని ప్రార్థించానన్నారు. ఇట్టి కార్యక్రమంలో వల్లభాయ్ పటేల్, నల్ల మల్లేశం, మాణిక్యం, పరమదాసు మరియు పిఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము, బామిని రవి కుమార్, హరీష్, చీలం సురేష్, మాలె శ్రీనివాస్, ఆనంద్, సతీష్, అఖిల్ నరేష్, నల్ల సాయి కిరణ్ , మనోజ్ , సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.