ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని వేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని… మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కిలోమీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50వేల చెట్లు కూలాయన్నారు. క్లౌడ్ బరస్ట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తెలియజేశామన్నారు. కూలిన చెట్లను వారంలోగా డిపోలకు తరలిస్తామన్నారు. మేడారం అడవుల్లో చెట్ల వేళ్లు లోతుగా లేవని. అందుకే వందల ఎకరాల్లో అడవి ధ్వంసమైందని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పీసీసీఎఫ్ పేర్కొన్నారు.
మూడు రోజుల క్రితం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50 వేల చెట్లు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్దఎ త్తున గాలిదుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 1న పరిశీలనకు వెళ్లిన అధికారులు. ఈదృశ్యాలను చూసి, షాక్‌కు గురయ్యారు. అయితే. టోర్నడోల్లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయి. కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయి. భారీ వృక్షాలు కూడా నేలకొరగడాన్ని బట్టి.. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చు’’ అని వివరించారు. అయితే 50 వేల చెట్లు ఒకేసారి నేలకొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డీఎ్‌ఫవో రాహుల్ జావేద్ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ(ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ)తో కలిసి పరిశీలన జరుపుతోంది. మంగళవారం ఆయన.. సీసీఎఫ్ ప్రభాకర్‌తో కలిసి తాడ్వాయ్-మేడారం అడవుల్లో నేలమట్టమైన చెట్లను పరిశీలించారు.