అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యాన్ని దేవరుప్పుల పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరుప్పుల తండాలో ఓ ఇంట్లో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఎస్సై సృజన్ కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన బోడ రాములు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. కాకుండా ఆ నిందితుడి వద్ద 150 లీటర్ల బెల్లం పాకం, 30 కేజీల పాతిక, 20 కేజీల బెల్లం లభ్యమైందని అట్టి స్థావరాన్ని ధ్వంసం చేసి ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించడం జరిగిందని ఎస్సై తెలిపారు. ఎవరైనా పిడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి కఠినంగా రవాణా చేసినా, గుడుంబా తయారీ స్థావరాలను ఏర్పాటు చేసి గుడుంబా తయారు చేయడం చూసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇట్టి ఆపరేషన్ లో ఎస్సై వెంట పోలీస్ కానిస్టేబుల్ లు మసూద్, యాకేష్, ఉన్నారు.