December 23, 2024
jaggareddy

బీఆర్ఎస్ పైసల రాజకీయాల వల్లే ఈ దుస్థితి

తెలంగాణ రాజకీయాలు మారిపోయాయని, ఎమ్మెల్యే, ఎంపీలు కావాలంటే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టా్ల్సి వస్తోందని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు కులాలు, మతాలతో నడవడం లేదని, కేవలం డబ్బులతోనే నడుస్తున్నాయని ఆరోపించారు. ఇదంతా బీఆర్ఎస్ (BRS) నిర్వాకమేనని, విభజన తర్వాత ఆ పార్టీ పుణ్యమా అని తెలంగాణ రాజకీయాలల్లో డబ్బుల సంప్రదాయం వచ్చిందని, గత ఎన్నికల్లో ఎలక్షన్ ఖర్చును బీఆర్ఎస్ కోట్లలోకి తీసుకుపోయిందని ఆరోపించారు. అందుకే ఈ రోజుల్లో ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కుమ్మరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహేశ్ కుమార్ గౌడ్‌కి పీసీసీ ఇవ్వడంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని షాకింగ్ లెక్కలు కూడా చెప్పారు. జనరల్ సీట్ అయిన సంగారెడ్డి లో గెలవాలంటే రూ.50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, పటాన్ చెరువు లాంటి సీట్ అయితే రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆరోపించారు. ఇక ఎంపీగా పోటీ చేస్తున్నా రూ.50 నుంచి రూ.100 కోట్లు ఖర్చుపెట్టనిదే గెలిచే ఛాన్స్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి ఈ రోజుల్లో కులాల అండతో, మతాల అండతో రాజకీయం నడవడం లేదని, కేవలం పైసలతోనే నడిచే దుస్థితి దాపురించిందని, దీనికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పీసీసీ కొత్త అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్ కుమార్‌ గౌడ్‌ కు శుభాంకాక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *