మిర్యాలగూడ జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ నాయకులు గురువారం నూతన సబ్ కలెక్టర్ ను కలిసి ప్రజల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ రాజు, మారం శ్రీనివాస్, మాలోత్ దశరథ్ నాయక్, డాక్టర్ ముని ర్, కోల సైదులు, రతన్ సింగ్ నాయక్, తాళ్ల పల్లి రవి, మాడుగుల శ్రీనివాస్, బంటు సైదులు వంటి నేతలు పాల్గొన్నారు.
వీరంతా కొత్త సబ్ కలెక్టర్ కు నోట్ పుస్తకాలు, పెన్నులు అందించి వినతి పత్రం సమర్పించారు. వీరు మాట్లాడుతూ, “మిర్యాలగూడ, సాగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు స్థానికంగా పరిష్కారం కావాలి. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసలకు లోనవకుండా, డివిజన్ కార్యాలయంలోనే సమస్యలు పరిష్కారం కావాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని సూచించారు.
జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన చేసేందుకు అవగాహన కల్పించాలని కోరుతూ, “భూసమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, యువతలో గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం నివారించేందుకు తగు చర్యలు చేపట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు చేరేలా చూడాలి” అని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు దాసరాజు జయరాజు, పారుక్, అంజయ్య, నల్లగంతులు నాగభూషణం, సైద నాయక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.