December 23, 2024
GXH2046XoAAc2G8

ప్ర‌జల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆర్టీసీ నూత‌న బ‌స్సుల కొనుగోలు చేయాల‌ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను అందుకు ప్ర‌తిపాదిక చేసుకోవాల‌ని సూచించారు.

* మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆర్టీసీ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు.
* మ‌హాల‌క్ష్మి ప‌థకం మ‌హిళ‌లు వినియోగించుకుంటున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని అధికారులు వివరించారు.
* ఇప్ప‌టి వ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణం చేయగా, తద్వారా ప్ర‌యాణికుల‌కు రూ. 2,840.71 కోట్లు ఆదా అయినట్టు అధికారులు చెప్పారు.
* ఆర్టీసీకి చెందిన 7,292 బ‌స్సుల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తుండగా, ఈ ప‌థ‌కం ప్రారంభ‌మైన త‌ర్వాత వివిధ జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆస్పత్రులకు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరిగినట్టు అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *