దిల్సుఖ్నగర్ P.N.T కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి అదే విధంగా నిర్వహించే క్రమంలో కొత్తగా పత్తి (Cotton)తో డెకరేషన్ చేశారు. అంతా పూర్తయింది అనుకునే లోపు మెయిన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ అయి విద్యుత్ ఘాతుకానికి కాలి బూడిద అయిపోయింది. దైవ అనుగ్రహం ఉండడం వల్ల ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కాలేదు. ఘటనకు ఐదు నిమిషాల ముందు మండపం వద్ద ఉన్న చిన్నారులు అందరు తమ ఇంటికి వెళ్ళారు. అలా వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. మండపం వద్ద చిన్నారులంతా కన్నీరుమున్నీరయ్యారు.