మూడు జోన్లుగా హైడ్రా!
హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమైంది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్‌ఎండీఏ వరకు విస్తరించనుంది.
మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను సెంట్రల్ జోన్‌గా, సైబరాబాద్‌ను నార్త్ జోన్‌గా, రాచకొండను సౌత్ జోన్‌గా విభజించనుంది.
హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది.